A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు బహిరంగ లేఖ
Share |
November 18 2019, 11:12 am

ముఖ్యమంత్రి జగన్ కు,టిడిపి ఎపి అద్యక్షుడు కళా వెంకటరావు బహిరంగ లేఖ రాశారు.అందులో ఏకంగా రైతుల గొంతును తడిగుడ్డతో కోశారని ఆయన ఆరోపించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రైతుల గురించి మీరు చెప్పింది కొండంత.. చేస్తోంది గోరంత. రుణమాఫీ జీవో
రద్దుతో రైతులను నిలువునా ముంచిన మీరు.. ఇప్పుడు రైతు భరోసా సాయానికి
పెద్దమొత్తంలో కోత విధిస్తూ మరోసారి తడిగుడ్డతో వారి గొంతుకోశారు. మీ
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. అన్నదాతలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు
జవాబివ్వండి..

1. బడ్జెట్‌లో 64.06 లక్షల మందికి పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చి..
అమలులో మాత్రం 54 లక్షలకు కుదించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 3లక్షలకు తగ్గించారు. ఇది నమ్మకద్రోహం కాదా..?

2. రైతులకు ఒకేదఫాలో ఏటా రూ.12,500 ఇస్తామని 2017లో జరిగిన ప్లీనరీలో
ప్రకటించారు. అంటే రాష్ట్ర నిధుల నుండే ఇస్తానని హామీనిచ్చారు. 2017 నాటికి పీఎం
కిసాన్‌ సమ్మాన్‌ రూ. 6వేలు ప్రకటించలేదు. హామీపై నిలబడే వారైతే ముఖ్యమంత్రి
జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రూ.6వేలతో పాటు రాష్ట్రం నుండి
రూ.12,500 మొత్తం రూ.18,500 వేలు ఇవ్వాలి. రూ.18,500కి బదులు రూ.13,500 ఇస్తామంటే
రూ.5వేలు ఒక్కొక్క రైతుకు ఎగనామం పెట్టడం కాదా..?

3. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుండి రూ.13,500కి బదులు కేవలం రూ.7,500
మాత్రమే చెల్లిస్తూ.. రూ.13,500 ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది
అబద్ధం కాదా..? రైతు దగా కాదా..?
గతంలో తాము రుణమాఫీని వాయిదాల పద్దతిలో ఇస్తామంటే విమర్శించిన వైసిపి ఇప్పుడు వాయిదాల పద్దతిలో ఎందుకు ఇస్తోందని కళా వెంకటరావు ప్రశ్నించారు.

కళా మరీ ఇంత అన్యాయంగా గొంతుకోశారని వ్యాఖ్యానించాలా?

tags : kala

Latest News
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info