A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
Share |
November 22 2019, 12:19 am

ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో చెప్పిన విదంగా రైతు భరోసా పదకాన్ని ప్రారంబించడమే కాకుండా, మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి మనసున్న ముఖ్యమంత్రిగా రుజువు చేసుకన్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు లో జరిగిన రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించారు. చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తూ తనవల్లే రిజర్వాయిర్లు నిండాయని అబద్దాలు ప్రచారం చేసుకున్నారని మంత్రి అన్నారు. మొదటసారిగా ఎపిలో అన్ని రిజర్వాయిర్లు పులిచింతల, సోమశిల రిజర్వాయిర్లు కూడా నిండాయని అన్నారు. చంద్రబాబు దరద్ర పాలనలో వర్షాలే పడలేదని , రైతులంతా అల్లాడారని ఆయన అన్నారు. మొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఆయకట్టుకు నీరు అందించగలుగుతున్నామని ఆయన అన్నారు. తాను మంత్రిగా కన్నా జగన్ అనుచరుడు, సేవకుడిగా అనిపించుకోవడమే ఇష్టమని ఆయన అన్నారు.

tags : anil yadav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info