A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
Share |
May 31 2020, 6:35 am

ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు వైఎస్సార్ రైతు భరోసా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎమ్.వి.ఎస్.నాగిరెడ్డి అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ముందుకు సాగుతాయని... కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాలు పథకాలు అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అర్హులైన రైతులకు రూ.12500 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదనంగా మరో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు నిర్ణయించారని తెలిపారు. ఈస్కీమ్ కింద సాయం అందని అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు.చంద్రబాబు ఏనాడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని,రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేక పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు.

tags : nagireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info