A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
Share |
May 31 2020, 5:15 am

ముఖ్యమంత్రి కెసిఆర్ పామ్ హౌస్ లో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఏకే 47 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఇతను తాగిన మత్తులో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జెయల్ అన్నారు. అతను గత కొంతకాలంగా విధులకు సరిగా హాజరుకావడం లేదని తెలిపారు. వెంకటేశ్వర్లు భార్య విఙ్ఞప్తితో తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకున్నట్టు చెప్పారు. మృతుని స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని చాడ గ్రామం అని తెలిపారు. కేవలం వ్యక్తిగత సమస్యల కారణంగా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

tags : telangana, kcr,farmhouse

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info