A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
Share |
May 31 2020, 6:36 am

ఇద్దరు ఎమ్మెల్యేల మద్య వివాదం వస్తే దానిని పరిష్కరించుకోవడానికి మీటింగ్ పెడితే దానిని పంచాయతీ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎన్నిసార్లు ఆయన పై విమర్శలు వచ్చినా పులివెందుల పంచాయతీ అని అనడం మానలేదు. గతంలో కడప పంచాయతీ అని,రాయలసీమ రౌడీలు అని వ్యాఖ్యానించడం ఆయనకు అలావాటు అయింది.ఒక ప్రాంతం లేదా కులం ప్రాతిపదికన అందరిని కలిపి అవమానించకూడదన్న కనీస ఇంగితం లేకుండా నలభైరెండేళ్ల సీనియర్ నేత వ్యవహిరస్తున్న తీరు తెలుగుదేశం పార్టీకే కాదు..తెలుగువారికే అవమానకరంగా మారుతోంది.చంద్రబాబుకు ఈ అలవాటు ఇప్పటిది కాదు. ఆయన తన పార్టీలోని వర్గాల వారిని పిలిచి ఎన్నోసార్లు రాజీలు చేయడం, లేదా త్రిసభ్య కమిటీలని పెట్టి వారివద్ద చర్చలు జరిపించడం వంటివి ఎన్నో చేశారు.
నిజానికి పంచాయతీ అన్న పదానికి చాలా అర్దాలు ఉంటాయి. కొన్ని వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం, లేదా బెదిరించి రాజీలు కుదర్చడం.లేదా వాళ్లను డబ్బు పంచుకునేలా ఏర్పాట్లు చేయడం .చంద్రబాబు ఇలాంటి వాటిలో దిట్టగా పేరొందారు. కాకపోతే ఆయన ముందుగా ఎదుటివారిని బదనాం చేసి,తాను మాత్రం ఆ పంచాయతీల ద్వారా లాబపడాలని చూస్తారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని పంచాయతీలు చేశారో తెలియదా? ఆయా జిల్లాలలో నియోజకవర్గాలవారిగా చూస్తే చాంతాడు అంత అవుతుంది. ఇరవై మూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు ఎంత పంచాయతీ చేశారో టిడిపి వారు మర్చిపోయారా? కర్నూలు లో టిజి వెంకటేశస్, ఎస్వి మొహన్ రెడ్డిల మద్య గొడవ నుంచి ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ ల వరకు..ఒకటేమిటి? ఎన్నో ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఒకే పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరితో భేటీ అయితే పంచాయతీ అయితే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని, సొంత పార్టీ నేతలతో రాజీలు చేసినప్పుడు ఏమనాలి.రాజకీయ దందా అనాలి.డబ్బులు పంపిణీ అనాలా?ఈ మాట మనం చెప్పడం కాదు. అప్పట్లో వైసిపి నుంచి పిరాయించి మంత్రి జమ్మలమడుగు నేత ఆదినారాయణరెడ్డి స్వయంగా చెప్పారు. ఆ వీడియోలు ఇప్పటికీ సర్కులేషన్ లోనే ఉన్నాయి.చంద్రబాబు ఐఎఎస్ లను కూడ కూర్చోబెట్టి రాజీ చేయించారని, నియోజకవర్గంలో పనులను,వచ్చే ఆదాయాన్ని ఫిప్టి,పిప్టి చేసుకోమన్నారని చెప్పారా?లేదా? దానిని పంచాయతీ దందా అంటారు. ప్రజల సొమ్మును అడ్డగోలుగా తమ నేతలను తినండని చెప్పడాన్ని పంచాయతీ అంటారు. అద్దంకి లో ఎమ్మెల్యేగా ఉన్న రవికుమార్ టిడిపిలోకి వచ్చినప్పుడు కరణం బలరాంతో ఎలాంటి ఒప్పందం చేశారు? రవికుమార్ కు ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండాను, అలాగే కరణం వర్గానికి ఇబ్బంది రాకుండాను రాజీ చేయడాన్ని పంచాయతీ అంటారు.ఇక చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రంగంలో దిగి చింతమనేనికి అండగా నిలబడి ఆడకూతురని కూడా చూడకుండా వనజాక్షిని బెదిరించారే..దానిని పంచాయతీ అంటారు.రవాణా కమిషనర్ గా ఉన్న బాలసుబ్రహ్మణ్యాన్ని ఎమ్.పి కేశినేని నాని, అప్పటి ఎమ్మెల్యే బొండా ఉమ వంటివారు బెదిరించినప్పుడు వారిపై కేసు పెట్టకుండా అదికారులను అడ్డుకున్నారే దానిని పంచాయతీ అంటారు.ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని ఉదాహరణలు అయినా ఇవ్వవచ్చు. ఇప్పుడు జరిగిందేమిటి?నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ప్రాంతానికి నీటి కనెక్షన్ వ్యవహారంపై వివాదపడ్డారు.అయినా ఆయన ఎమ్.పిడి.ఓ. సరళను పోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. అది వేరే ఎమ్మెల్యేతో వచ్చిన గొడవ అని అన్నారు.అయినప్పటికీ ముఖ్యమంత్రిగా జగన్ ఏమి చేశారు. కోటంరెడ్డి పై కేసు పెట్టవద్దన్నారా? అరెస్టు చేయవద్దని పోలీసులకు చెప్పారా?పోలీసులు వెంటనే కోటంరెడ్డిని అరెస్టు చేశారే? అయినా టిడిపికి, చంద్రబాబు కు, పవన్ కళ్యాణ్ వంటివారికి సంతృప్తి కలగలేదు.బెయిల్ ఎలా ఇస్తారని నిసిగ్గుగా ప్రశ్నించారు. తాము అదికారంలో ఉన్నప్పుడు అసలు అరెస్టు చేయలేదన్న సంగతిని విస్మరించి వైసిపి ప్రభుత్వం లో సొంత ఎమ్మెల్యేలను అరెస్టు చేయిస్తే అంతవరకు అబినందించవలసింది పోయి ఏదో ఒక కు విమర్శ చేసి టిడిపి నేతలు పరువు పోగొట్టుకుంటున్నారు.చంద్రబాబుకు వేరే సబ్జక్టు దొరక్క ఇలాంటి చిన్న,చిన్న కేసులను కూడా బూతద్దంలో చూపించి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు. మాట్లాడితే టిడిపి కార్యకర్తలపై దాడులని, కేసులని పదే,పదే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా,టిడిపి ఎలా కాచుకుని కూర్చున్నది గమనించి వైసిపి నేతలు కూడా జాగ్రత్తగా ఉండవలసిందే.అందులో సందేహం లేదు. అయితే చంద్రబాబు మాత్రం ప్రాంతం పేరుతో, కులం పేరుతోనో దూషణలకు దిగడం మాత్రం పద్దతి కాదు. అందుకే వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇలా మరోసారి చంద్రబాబు అవమానిస్తే ఆ ప్రాంత ప్రజలు ఆయన మూతిమీద వాత పెడతారని హెచ్చరించారు. వాతల వరకు ఎందుకు గాని, ఏ నాయకుడు అయినా పద్దతిగా మాట్లాడినంతవరకు ఇబ్బంది లేదు.కాని చంద్రబాబు హద్దులు మీరి పంచాయతీ అంటూ కువిమర్శలు చేయడం మాత్రం దురదృష్టకరం.

tags : ap, tdp,ycp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info