A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
Share |
May 31 2020, 6:43 am

టిఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్.పి కె.కేశవరావు జారీపోయినట్లుగా ఉంది. ఆయన తను రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. తాను కార్మికుల పక్షపాతి అని కేశవరావు చెప్పారు. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేజారుతున్నాయనే అనుమానంతో లేఖ విడుదల చేశానని అంటున్నారు. ‘‘నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని నేను అనలేదు. మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం. సీఎం ఆదేశిస్తే కచ్చితంగా చర్చలకు దిగుతా. నాతో చర్చలకు కార్మికులు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు’’అని కేశవరావు తెలిపారని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

tags : kk, letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info