A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇసుకను సీజ్ చేశారు
Share |
February 25 2020, 8:30 am

కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ నిల్వలను భారీగా పట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. విజయవాడ సమీపంలోని ఎనికేపాడు వద్ద మాల్ నిర్మించడానికి తవ్వకాలు చేపట్టగా అక్కడ పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు కనిపించాయట.అయితే ఆ ఇసుకను అదికారికంగా తరలించడం కష్టం కనుక, దానికి బుసక అని పేరు పెట్టి తరలించే యత్నం చేశారట.అయితే ఆ విషయం జాయింట్ కలెక్టర్ దృష్టి కి వెళ్లగా ఆమె వెంటనే స్పందించడంతో అసలు విషయం బయటపడిందట. బుసక పేరుతో తరలిపోయిన ఇసుకే సుమారు 50వేల టన్నుల వరకు ఉంది. అనధికారికంగా మరో 10 నుంచి 20 వేల టన్నుల ఇసుకను తరలించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద 60వేల టన్నుల ఇసుకతో సుమారు రూ.12 కోట్లు వరకు వ్యాపారం జరిగిందని చెబుతున్నారు. ఏదైనా ప్రైవేటు స్థలంలో ఇసుక నిల్వలు బయటపడితే దాన్ని తరలించేందుకు కలెక్టర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జేసీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సోమవారం జేసీ ఆ స్థలాన్ని పరిశీలించి, ఇసుకను సీజ్ చేయాలని ఆదేశించారని కదనం.

tags : ap,sand

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info