A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నెల్లూరు వైసిపి పంచాయతీ ముగిసినట్లేనా
Share |
February 25 2020, 9:11 am

నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పంచాయతీ సర్దుబాటు అయినట్లేనా? ఇద్దరు ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దనరెడ్డి, కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డిలు తాము బావా,బావమరదులం అని, తమ మద్య గొడవలకు ఆస్కారం లేదని ప్రకటించడం విశేషం. మద్యలో ఎవరో కొందరు తగాదా పెట్టాలని చూసినా కుదరదని వారు అంటున్నారు. పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ల సమక్షంలో వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం అయ్యారు. ఆ తర్వాత తాము వివాదం గురించి చర్చించలేదని, ఈనెల పదిహేను న రైతు భరోసా పదక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్నందున దానిని విజయవంతం చేసే అంశంపై చర్చించామని చెప్పారు. కాగా రాజకీయ వివాదాలపై ఎలాంటి చర్చలు జరగలేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్నారు.

tags : ysrcongress, nellore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info