A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వైఖరి దూకుడా..ఆత్మరక్షణా
Share |
October 16 2019, 10:35 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బహుశా ఈ మద్యకాలంలో ఎన్నడూ లేనంతగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఆర్టిసి కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు , తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆర్టిసిని ఏభై శాతం ప్రైవేటీకరిస్తామని ఆయన అంటున్న వైనం రాజకీయంగా ఆయనకు నష్టం చేయవచ్చన్న అబిప్రాయం కలుగుతుంది.అంతేకాదు ..కార్మికులను ఉద్దేశించి ఏభైవేల మందిని తొలగించేశామని చెప్పిన వైనం ప్రజాస్వామ్యం లో సరైనదేనా అన్న చర్చ జరుగుతోంది.అంతకన్నా సెప్టెంబర్ నెలలో పని చేసిన కాలానికి ఆర్టిసి కార్మికులకు జీతం ఇవ్వకుండా ఆపడం అమానవీయం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ఆర్టిసి కార్మికులకు కాలిలో ముల్లు గుచ్చుకుంటే నాలుకతో ముల్లు తీస్తానని అన్న కెసిఆర్ , కేవలం పండగ అడ్వాన్స్ కోసం గతంలో ఆర్టిసి కార్మికుల తరపున దర్నాలు చేసిన టిఆర్ఎస్ ఇప్పుడు అదికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టిసి కార్మికుల తో తగాదా పెట్టుకోవడం,అసలు సంఘాలే ఉండరాదని అనే పరిస్తితికి వెళ్లడం చారిత్రక విశేషమే అని చెప్పాలి. ప్రస్తుతం కార్మిక సంఘాల జెఎసికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి టిఆర్ఎస్ కు, ఆ పార్టీ ముఖ్యనేతలకు సన్నిహితుడే. అప్పట్లో హరీష్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ కు అనుబందంగా ఆర్టిసిలో కార్మిక సంఘం ఏర్పాటు చేసి,కార్మిక సంఘం ఎన్నికలలో విజయం సాదించింది వాస్తవం కాదా? ఇక్కడ సమస్య ఆర్టిసి కార్మికుల సమ్మె న్యాయబద్దమా?కాదా?అన్నది కాదు. ఇక్కడ చర్చ ఆర్టిసి కార్మికులు తప్పుచేశారా?లేదా? పండగకు ముందు సమ్మెలోకి వెళ్లి ఆర్టిసికి,ప్రయాణికులకు కష్టనష్టాలు తెచ్చిపెట్టారా?లేదా అన్నది కాదు. కెసిఆర్ వ్యవహార శైలి చర్చనీయాంశం అవుతోంది.నిజమే ఆర్టిసి కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రత్యామ్నాయం చూడడం తప్పుకాదు. కాని వారిని సరైన తీరులో హాండిల్ చేయకపోవడం వల్ల ఈ సమస్య ఇంతదాకా వచ్చిందన్న భావన కలుగుతోంది.పైగా గతంలో తమిళనాడులో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ ఉద్యోగులు లక్షాడెబ్బై వేల మందిని ఒక కలం పోటుతో తీసివేస్తున్నట్లు ప్రకటించిన మాదిరే ఇక్కడ కెసిఆర్ కూడా ఏభైవేల మంది ఉద్యోగాలు తీసేశానని ఒకసారి,సెల్ప్ డిస్మిస్ అయ్యారని మరోసారి అంటున్నారు. జయలలిత ఉద్యమ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఆమె ఎమ్.జి.ఆర్.వారసురాలిగా, సినిమా నటిగా గుర్తింపు పొంది ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కాని కెసిఆర్ ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాదనలో కర్మ,ఖర్మ ,క్రియ అన్నీ తానే అని ఆయనే చెప్పుకుంటారు. అనేక రకాల సమ్మెలకు ఆయన అప్పట్లో బాద్యత వహించారు. సకలజనుల సమ్మె వంటివాటిని ఆయన ప్రోత్సహించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒంటి కాలితో లేచేవారు.కార్మికులకు తానే అండ అన్నట్లుగా మాట్లాడేవారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తే, విభజిత ఎపిలో కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్టిసి కార్మికులను ప్రభుత్వంలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది సరైనదా?కాదా?అన్నదానిపై చర్చించవచ్చు. కాని గతంలో కెసిఆర్ కూడా పలుమార్లు ఇదే హామీ ఇచ్చారని అంటున్నారు.మరి అది వాస్తవం అయితే ఆయన ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో వివరణ ఇవ్వాలి.ఆర్టిసికి ఏభైవేల కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.అలాంటప్పుడు ఆర్టిసిని ప్రభుత్వం నడపలేకపోవడం వైఫల్యం కాదా?తెలంగాణ ఉద్యమాన్ని తీసుకు వచ్చిందే నిదులు,నీళ్లు,నియామకాల అంశాల మీదకదా? ప్రభుత్వ ఉద్యోగాలు వేరే వారు పొందుతున్నారనే కదా..మరి ఇప్పుడు కెసిఆర్ అసలు ఉన్న ఆర్టిసి ఉద్యోగాలను తీసేస్తానని అనడం ఏమి సంకేతం.పైగా ఆయన పదే,పదే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూ వచ్చారు కదా?ఆర్టిసి కి సంబందిందించి 2500 కోట్ల రూపాయల నష్టాలను తీర్చలేకపోయారా?ప్రైవేటు రంగానికి నేరుగా అప్పగించడం ద్వారా ప్రజా రవాణాను కెసిఆర్ మెరుగుపరుస్తారా?మరింత సమస్యలలోకి తీసుకువెళుతున్నారా?ఇదేపని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఉంటే ఒప్పుకునేవారా? గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచితేనే తీవ్రంగా వ్యతిరేకించిన కెసిఆర్ ,తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కెసిఆర్ ఇప్పుడు ఇంత కఠిన వైఖరి తీసుకోవడం అవసరమా? అంటే తద్వారా చంద్రబాబు మాదిరి కెసిఆర్ కూడా మాటలు మార్చుతున్నారన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా? కెసిఆర్ అదికారంలోకి వచ్చిన తర్వాత బహుశా మొదటిసారి ఇలాంటి తీవ్రమైన సమస్యను ఎదుర్కుంటున్నట్లుగా ఉంది. ప్రతిపక్షాలకు ఆయనే ఒక ఆయుదం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఏ సమస్య అయినా చర్చలు,సంప్రదింపుల ద్వారా కొంత మేర పరిష్కారం చేసుకోవచ్చు. అందులోను కెసిఆర్ వంటి మాటకారికి ఇది పెద్ద ఇబ్బంది కాదు. కాని ఆయన ఎందుకు అహందెబ్బతిన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక వరసగా తప్పులు చేస్తున్నారన్న అబిప్రాయం కలుగుతుంది.మంత్రులకు అసలు పెద్దగా విలువ ఇవ్వకపోవడం నుంచి కార్మిక సంఘాల వారితో సామరస్యంగా చర్చలు జరపలేని పరిస్థితిలోకి వెళ్లడం ప్రభుత్వ లోపంగా కనిపిస్తుంది.ప్రజా స్వామ్యం గురించి పెద్ద ఎ త్తున మాట్లాడే కెసిఆర్ ఇదే పోకడలు కొనసాగిస్తే ఆయనకే నష్టం. ఎప్పటికీ రాజ్యం తమదేనని ప్రజాస్వామ్యంలో ఎవరు అనుకున్నా ప్రమాదమే. జయలలిత కూడా ఇలా వ్యవహరించినప్పుడు దెబ్బతిన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మరి కెసిఆర్ కూడా అందుకు సిద్దపడతారా? ఆయన అంత తెలివితక్కువ వారు కాదు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట అన్న పేరు ఉన్న నేతే.ఆయన మొండిపట్టుదలకు పోకుండా మద్యవర్తుల ద్వారా రాయబారం చేయించి ఆర్టిసి సమ్మెకు ఎంత సత్వరమే పరిష్కారం తీసుకు వస్తే అంత మంచిది.లేకుంటే ఇప్పుడు కొంత మేర ప్రజలలో కార్మికులపై కూడా ఆగ్రహం ఉండవచ్చు.కాని కాలం గడిచే కొద్దీ అది అంతా ప్రభుత్వం ఖాతాలోకి వెళుతుంది. ప్రజల ఇబ్బందులకు ప్రభుత్వ వైఫల్యం కారణం అన్న అబిప్రాయం బలపడుతుంది.రెండో టరమ్ వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఎలా చేసినా ఫర్వాలేదనుకుంటే భ్రమలలో ఉన్నట్లే .ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తారా?చేయరా?కార్మికుల జీతాలు పెచుతారా?లేదా?అన్నది ప్రజలకు పెద్దగా అవసరం లేదు. వారికి రవాణా సదుపాయాలు లేకపోతే వాటికి కెసిఆర్ బాద్యుడు అవుతారు.ఈ విషయాన్ని గుర్తుంచుకుని కెసిఆర్ జాగ్రత్తపడతారని ఆశిద్దాం. కార్మిక సంఘాలు కూడా మరీ ఎక్కువ పట్టుదలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయడం మంచిదని కూడా చెప్పాలి.

tags : kcr, strike

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info