A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నెల్లూరు వైసిపి పంచాయతీపై జగన్ సమీక్ష
Share |
October 17 2019, 12:04 am

నెల్లూరు జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో కొందరు నేతల మద్య ఏర్పడిన తగాదాలపై, పార్టీ తీరు తెన్నులపై ముఖ్యమంత్రి,పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ సమీక్ష జరపనున్నారు. బుదవారం సాయంత్రం ఈ సమీక్ష జరుగుతుందని వార్త వచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఒక మహిళా అదికారిపట్ల దురుసుగా వ్యవహరించిన ఘటన నేపద్యంలో ఈ సమీక్ష జరుగుతోంది. మరో ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డికి కోటంరెడ్డి అనుచరుల మద్య వివాదం కూడా ఈ గొడవలకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై జగన్ ఇప్పటికే సీరియస్ అయ్యారు.నెల్లూరుజిల్లాలో పది కి పది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయి. ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు.

tags : jagan, nellore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info