A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రవిప్రకాష్ పై విజయసాయి ఆరోపణలు
Share |
February 22 2020, 12:39 am

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ పై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ కు లేఖ రాశారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, ఆయన సతీమణి దేవికారాణి వందలాది కోట్ల రూపాయల మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆర్‌బీఐ, ఐటీ నిబంధనలు, కంపెనీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ విదేశీ బ్యాంకులకు పెద్దఎత్తున నల్లధనం తరలించారని తెలిపారు. వి.రవిప్రకాశ్‌ అలియాస్‌ రవిబాబు తన హోదాను ఉపయోగించుకుని బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాలకు పాల్పడ్డారని, న్యూస్‌ చానళ్లు, సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని పెద్దఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. మొయిన్‌ ఖురేషీ కేసులో సీబీఐ అదుపులో ఉన్న సానా సతీశ్‌బాబుతో రవిప్రకాశ్‌కు సంబంధాలు ఉన్నాయని, వారు పలు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి హవాలా ద్వారా విదేశాలకు తరలించారని ఆయన అన్నారు. మొసద్దీలాల్‌ జువెలర్స్‌కు చెందిన సుకేశ్‌ గుప్తాతో కలిసి పలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఉగాండా దేశం కంపాలాలోని సిటీ కేబుల్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నప్పటికీ తన ఐటీ రిటర్న్స్‌లో ఆ విషయం చెప్పకుండా దాచారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

tags : vijayasai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info