A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రవిప్రకాష్ అరెస్టుపై మాట్లాడరే- రేవంత్ ప్రశ్న
Share |
October 17 2019, 12:18 am

ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిన ప్రతి ఒక్కరినీ జైల్లో పెట్టిం చే విధానం సరికాదని కాంగ్రెస్ ఎమ్.పి రేవంత్ రెడ్డి అన్నారు. టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ ను జైలులో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రామోశ్వరరావుకు,మెగా కృష్ణారెడ్డిలకు భయపడి, వారిచ్చే సొమ్ములకు ఆశపడో ఈ విషయంలో ఆయా రాజకీయ పార్టీల నేతలు మౌనంగా ఉండడం కరెక్టు కాదని ఆయన అన్నారు. తెలంగాణలో మీడియాపై కొనసాగుతున్న నిర్బంధాన్ని జాతీయ మీడియా దృష్టి కి తీసుకెళ్తామని చెప్పారు. అక్రమ ని ర్బంధాలు జర్నలిస్టులకు కొత్తకాదని, కా ర్పొరేట్‌ క్రిమినల్స్‌ దేశంలో చాలామంది జర్నలిస్టులను హత్య చేశారని, అంత మాత్రాన జర్నలిస్టు లు అణిగి ఉంటారని ప్రభుత్వాలు భావించడం భ్రమేనని తెలిపారు. రవిప్రకాశ్‌కు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని తెలిపారు.కాగా నటుడు శివాజీ ఒక ఆరోపణ చేస్తూ రవిప్రకాష్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

tags : revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info