A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు,జగన్ కు తేడా ఏముంది-కన్నా
Share |
February 22 2020, 12:18 am

ఎపి బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేశారు. ఆటో డ్రైవర్ లకు పదివేల సాయం ఇచ్చిన సందర్భంలో ఆటోలకు స్టికర్లు వేయడంపై ఆయన ట్విటర్ లో కామెంట్ చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, జగన్ కు తేడా ఏముందని ఆయన ప్రశ్నించారు. ఆయన కామెంట్ ఇలా ఉంది.

బాబుకి మీకు ఏమి తేడా జగన్?

ఆయన కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసాడు,మీరు అంతకుమించి అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులను పార్టీ కార్యకర్తలుగా చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారు.
.........................

కన్నా లక్ష్మీనారాయణ నిజంగానే అలా అనుకుంటున్నారా? చంద్రబాబును మించి అదికార దుర్వినియోగం అనడం అతిశయోక్తి కాదా? ఎందుకో సడన్ గా చంద్రబాబుపై కన్నాకు ప్రేమ పుట్టుకు వచ్చిందా?

tags : kanna, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info