A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Share |
February 22 2020, 12:21 am

వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మరో మాజీ ఎమ్మెల్యే చేరారు. రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఆకుల తన అనుచరులతో పాటు పార్టీలో చేరగా, పార్టీ కండువా కప్పి వారిని జగన్ స్వాగతించారు. మరో టిడిపి నేత జూపూడి ప్రబాకరరావు కూడా జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. జగన్ చెప్పిన ప్రకారం పాలన చేస్తున్నారని,అనేక మంది మద్య నిషేధం గురించి మాట్లాడారని, కాని జగన్ ఆ దిశగా నడుస్తున్న నేత అని ఆయన అన్నారు. ఆకుల సత్యనారాయణ గతంలో బిజెపి పక్షాన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనసేనలో చేరారు. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు.జనసేనకు గుడ్ బై చెప్పి వైసిపిలో చేరారు.

tags : akula

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info