A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త టెండర్ల వ్యవస్థకు ఎపిలో శ్రీకారం
Share |
October 16 2019, 11:25 pm

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టం ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత), 2019 చట్టము 14.08.2019 నుండి అమలులోకి వచ్చినది. ఈ చట్టమును అనుసరించి న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా రాష్ట్రములో మౌలిక సదుపాయముల టెండర్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకువచ్చుటకు, దాని ద్వారా ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధముగా వినియోగించుకొనేటట్లు చూడడానికి మరియు అందుకు సంబంధించిన లేదా అనుషంగికమైన విషయముల కొరకు.

ఈ చట్టమును అనుసరించి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము నందలి ప్రభుత్వ ఏజెన్సీ లేదా స్ధానిక అధికారి, 100 కోట్ల రూపాయలు మరియు అంతకుమించిన మౌలికసదుపాయముల ప్రాజెక్టులకు సంబంధించి టెండరుకు సంబంధించిన పత్రములన్నింటిని న్యాయపరమైన ముందు సమీక్షకు గౌరవ న్యాయమూర్తి గారికి సమర్పించవలెను. ఈ సంస్ధను నెలకొల్పడములోని ముఖ్య ఉద్దేశం, ప్రజా ప్రయోజనములో ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించేటట్లు, ఆ ప్రకారంగా అనుసరించవలిసిన ప్రకియలలో పారదర్శకతను తీసుకురావడం కొరకు.

జడ్జి జ్యుడిషియల్‌ – ప్రివ్యూ యొక్క అధికారిక లోగో మరియు వెబ్‌సైట్‌ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ రోజు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ప్రారంభించారు.
వెబ్ సైట్: judicialpreview.ap.gov.in

ఈ కార్యక్రమానికి జస్టిస్‌ డా. బి. శివశంకరరావు, జడ్జి – జ్యుడీషియల్‌ ప్రివ్యూ, ఆంధ్రప్రదేశ్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు శ్రీ ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శ్రీ అజేయ కల్లం, సీఎం ప్రిన్సిపల్‌ అడ్వైజర్, శ్రీ రజత్‌ భార్గవ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, శ్రీ సిద్దార్ధ్‌ జైన్, కమీషనర్‌ మరియు ఇన్‌స్పెక్టర్‌ జనరల్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్‌ శాఖ, శ్రీ ఎస్‌. శ్రీరామ్, అడ్వొకేట్‌ జనరల్, ఆంధ్రప్రదేశ్, శ్రీ ఏవి. పటేల్, జాయింట్‌ డైరెక్టర్, ఏపి ఇండస్ట్రీస్, శ్రీ వై. శరత్‌బాబు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్, ఏపిఐఐసి, గుంటూరు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

tags : ap,judicial commission

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info