A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బూతు మీడియా వార్తలు తప్ప బాబు వద్ద ఆదారాలేవి
Share |
June 2 2020, 12:14 am

ఆంద్రజ్యోతి బూతు మీడియాలో వచ్చిన వార్తల ఆదారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని పెడన వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాసే అర్హతే లేదని ఆయన అన్నారు .బిసి,ఎస్.సి,ఎస్టి వర్గాలవారికి అరవైఏడువేల ఉద్యోగాలు వస్తే చంద్రబాబు ఓర్వలేక ఏడుస్తున్నారని ఆయన అన్నారు. ఒకేసారి లక్షాముప్పై వేల ఉద్యోగాలు ఇస్తే చూసి భరించలేక, ఎపిబి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు ఓర్వలేక పేపర్ లీక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.బూతుపత్రిక వార్తలు తప్ప చంద్రబాబు వద్ద ఆదారాలు ఏమున్నాయని ఆయన అన్నారు.చంద్రబాబు తన పాలనలో ఎన్నడైనా ఉద్యోగాలు భర్తీ చేశారా అని ఆయన ప్రశ్నించారు. లక్షల మంది పరీక్షలు రాసి,ఫలితాలు వచ్చిన తర్వాత లీక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తారా అని రమేష్ ప్రశ్నించారు.

tags : jogi ramesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info