A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉద్యోగులు ప్రభుత్వాలను డిక్టేట్ చేయజాలరు-కెసిఆర్
Share |
June 2 2020, 1:36 am

ఉద్యోగులు ప్రభుత్వాలను డిక్టేట్ చేయజాలరని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం ప్రభుత్వం పనిచేయదని, ప్రజల కోసం పనిచేయదని ఆయన అన్నాఉ. వారు కోరుకున్న పనులు చేయజాలరని, ప్రభుత్వానికి అవసరమైన పనులు చేయవలసి వస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన అప్రోప్రియేషన్ బిల్లు పై జరిగిన చర్చకు ఆన సమధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.రెవెన్యూ చట్టం విషయంలో కొందరు ఉద్యోగ సంఘాల వారు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు కూడా ఎవరో చెప్పినవాటిని విని మోసపోరాదని ఆన అన్నారు.విఆర్.ఓ. వ్యవస్థ తీసేస్తామని తాము చెప్పలేదని, అవసరమైతే తొలగిస్తామని ఆయన అన్నారు. ఉద్యోగుల కన్నా శాసనసభ వ్యవస్థ పెద్దదని, ఇక్కడ చేసే చట్టాలు,తీర్మానాలు అమలు చేయవలసిన బాద్యత ప్రభుత్వానిది, ఉద్యోగులదని కెసిఆర్ అన్నారు.రైతులుతమ రుణాలు చెల్లించుకోవాలని, ఆ తర్వాత తాము వారి జాబితా ప్రకారం చెల్లిస్తామని కెసిఆర్ అన్నారు.

tags : kcr,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info