A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిరాయింపులపై కెసిఆర్ వాదన
Share |
June 2 2020, 1:38 am

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ,బిజెపిలు ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు. బిజెపి వారు టిడిపి ఎమ్.పిలు రాజ్యసభలో విలీనం అయిఇతే తప్పు లేదా?తమ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం అయితే మాత్రం తప్పా అని ఆయన అన్నారు. గోవాలో పది మంది ఎమ్మెల్యేలను బిజెపి తన పార్టీలో చేర్చుకుందని ఆన అయన అన్నారు. రాజస్థాన్ లో బిఎస్పి ఎమ్మెల్యేలు ఆరుగురిని కాంగ్రెస్ ఎలా విలీనం చేసుకుందని ఆయన అన్నారు. అంటే రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుందా అని ఆయన అన్నారు. అయితే రాజస్తాన్ లో అంతా ఒకేసారి విలీనం అయ్యారని, తెలంగాణలో ఒక్కొక్కరు ఒక్కోసారి పిరాయించారని,దానిపై పిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని మల్లుభట్టి అన్నారు.దీనికి కెసిఆర్ సమాదానం చెబుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరలేదని, వారంతా కలిసి ఉత్తరం రాసి విలీనం అయ్యారని జవాబు ఇచ్చారు.అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా వారు తెలిపారని ఆయన అన్నారు.

tags : kcr, defections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info