A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కే ప్రమాదం ఉంది ప్రజలకు కాదు-కెసిఆర్
Share |
October 16 2019, 10:31 pm

తెలంగాణలో ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని ఎలాంటి ప్రమాదం లేదని, కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ప్రమాదం ఏర్పడిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. శాసనసభలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు సమాదానం చెబుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్ ,బిజెపిలకు ప్రజలు సమాదానం చెప్పినా, వీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 2014 లో కాంగ్రెస్ కు 21 ఉంటే 2018లో 19 కి తగ్గిపోయాయని, బిజెపి సీట్లు నాలుగు నుంచి ఒకటికి తగ్గిపోయాయని, అయినా ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.గతంలో జానారెడ్డి చేసిన ప్రకటనలనే భట్టి చేస్తున్నారని ఆయన అన్నారు. హుజూర్ నగర్ లో ఇంతవరకు అసలు ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులను చేస్తోందని భట్టి ప్రచారం చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆయన అన్నారు.తమకు అన్ని జిల్లాలలోను ప్రజలు మద్దతు కొనసాగుతోందని ఆయన అన్నారు. బడ్జెట్ పై తాను మాట్లాడిన తర్వాత వందల పోన్ లు వచ్చాయని అన్నారు.పక్క రాస్ట్రంలో ఎన్నికల ముందు తాయిలాలు ఇచ్చి భంగపడ్డారని చంద్రబాబును పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల టైమ్ లో ఒక్క జిల్లా కలెక్టర్ లేదా ఎస్పితో మాట్లాడలేదని , డిజిపి తో కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు.ఒకే సందర్భంలో సిఈఓ చేసిన ప్రకటనను అమలు చేయండని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. ప్రజల మద్దతు లేకపోతే అదికారులు ఎవరూ కాపడలేరని కెసిఆర్ అన్నారు.తమ పార్టీ పుట్టిందే సాహసం మీద ఆయన అన్నారు. పార్టీ పెట్టినప్పుడే రాజీనామాలతో ఆరంభించామని ఆయనఅ న్నారు.కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి పదవులు ,ఎమ్మెల్యేల, ఎమ్.పి పదవులు వదలుకున్నామని, దేశ చరిత్రలోనే ఇది రికార్డు అని కెసిఆర్ అన్నారు.

tags : kcr, congress

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info