A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
Share |
June 2 2020, 12:38 am

ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత మొబైల్ ఫోన్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారని సమాచారం వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఆయన మొబైల్ పోన్ కోసం ఆరా తీయగా అది కనిపించడం లేదని వెల్లడైందట.దీంతో కోడెల ఇంటిలో వారు మొబైల్ పోన్ కోసం సోదాలు నిర్వహించారని టీవీలల వార్తలు వచ్చాయి. అయితే వారు కాల్ డేటా ఆదారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు.దాని ప్రకారం కోడెల చివరిగా 24 నిమిషాల సేపు ఎవరితోనో మాట్లాడారని వెల్లడైంది.అలాగే సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి పోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెబుతున్నారు. దీంతో కోడెల ఆత్మహత్య కేసు మిస్టరీగా అవుతుందా అన్న సంశయాలు వస్తున్నాయి.కేవలం ఆయన ఒత్తిడితోనే ఆత్యహత్య చేసుకుని ఉంటే మొబైల్ పోన్ ను ఎవరు గల్లంతు చేసి ఉంటారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.కాగా కోడెల అంత్యక్రియలు అదికార లాంభనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఛీప్ సెక్రటరీని ఆదేశించారు

tags : kodela ,phone missing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info