A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
Share |
October 17 2019, 12:15 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి జగన్ ప్రబుత్వం కారణమని, ఆయనపై కేసులు పెట్టాలని చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. పోలీసు కేసులు ప్రభుత్వం పెట్టలేదని, కోడెల కుమారుడు, కుమార్తెలు పెట్టిన వేదింపులు భరించలేకపోయినవారు కేసు లు పెట్టారని,వారిలో పలువురు టిడిపి వారు కూడా ఉన్నారని ఆయన అన్నారు. కోడెలే స్వయంగా పర్నిచర్ తన వద్ద ఉందని చెప్పిన మాట వాస్తవం అని ఆయన అన్నారు. ఎవరు ఏ కేసు పెట్టినా, ప్రభుత్వం ఇంతవరకు కోడెలకు గాని, ఆయన కుమారుడు, కూతురులకు నోటీసులు ఇవ్వలేదని, విచారణకు రావాలని కోరలేదని నాని అన్నారు. కోడెల ను అరెస్టు చేసేప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. ముప్పై,నలభై మంది కేసులు పెడితే ఆత్మహత్య చేసుకునే పిరికివాడా కోడెల అని చంద్రబాబును అడుగుతున్నానని ఆయన అన్నారు. ప్రత్యర్ది పార్టీ వారు కేసులు పెడితే పోరాటాలు చేస్తారు కాని, ఆత్మహత్య చేసుకోరని అన్నారు. నమ్ముకున్న పార్టీ వారు కాని, కుటుంబ సబ్యులు కాని ఆయనను వదిలించుకోవాలని అనుకుని పక్కనబెట్టినప్పుడే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారని అన్నారు. చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొని నలుగురిని మంత్రుల చేసినా కోడెల అబ్యంతరం చెప్పలేదని, అయినా పకోడెలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న బాద ఉందని ,చంద్రబాబు చేసిన పనులవల్లే ఈ పరిస్తితి ఏర్పడిందని నాని అన్నారు. పర్నీచర్ కేసులో ఏ చర్య తీసుకున్నా తాము అడ్డుకోబోమని చంద్రబాబు చెప్పిన వార్త ను ఆయన ఉటంకించారు. వర్ల రామయ్యతో కోడెలకు వ్యతిరేకంగా మాట్లాడించింది చంద్రబాబా ?కాదా అని ఆయన అన్నారు. కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా రాజాకు పదవి ఇచ్చి కోడెలను పక్కనపెట్టింది వాస్తవమా?కాదా అని నాని ప్రశ్నించారు. నరసరావుపేట ఇవ్వకుండా సత్తెనపల్లి కి పంపించింది చంద్రబాబు కాదా అని ఆయన అన్నారు. 2014 లో మంత్రి పదవి ని కోడెల కోరుకుంటే ఇవ్వనిది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు.స్పీకర్ గా పెట్టి ఆయనను చంపింది చంద్రబాబు కాదా అని ఆయన అన్నారు. చనిపోయిన తర్వాత కోడెల పల్నాటి పులి అని చంద్రబాబు చెబుతున్నారని, మరి బాదిత శిబిరం పెట్టి అక్కడకు కోడెల రాకుండా ఎందుకు చంద్రబాబు అడ్డం పడ్డారని నాని ప్రశ్నించారు.అసలు చంద్రబాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని కోడెల బాదపడుతున్నారని ఆయన అన్నారు.సత్తెనప్లిలో కోడెలకు వ్యతిరేకంగా గ్రూపును ్రోత్సహించింది చంద్రబాబు కాదా అని ఆయన అన్నారు. కోడెల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని చెప్పి ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేయాలని చర్చించింది వాస్తవమా?కాదా అని ఆయన అన్నారు.సోమవారం ఉదయం తొమ్మిదిన్నర్ర వరకు చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని ,కాని అది దొరకలేదని, ఆ తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. కోడెల పులి అయితే చంద్రబాబు నక్క అని, నక్క పులిని మోసం చేసిందని కోడెల వ్యాఖ్యానించారు. ఎన్.టి.రామారావు చనిపోవడానికి కారణం చంద్రబాబు అని , ఆ తర్వాత ఆయన శవం వద్ద దొంగ ఏడుపులు ఏడిచింది చంద్రబాబు కారణమని నాని అన్నారు.కెడెల పై అక్రమ కేసులు పెడుతున్నారని ఈ మూడు నెలల్లో ఎన్నడైనా చంద్రబాబు మాట్లాడారా అని నాని ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు,కోడెల కొడుకు కలిసి కొన్ని అక్రమాలు చేశారని ఆయన అన్నారు. కోడెలను వదలించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిచారని ఆయన అన్నారు.చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని, చంద్రబాబుకు కోడెల ఎన్నిసార్లు పోన్ చేశారో కాల్ డేటా చూస్తే తెలుస్తుందని, దానిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేయాలని కెసిఆర్ ను కోరుతున్నానని ఆయన అన్నారు.ఈ కేసులో ఎ1 నిందితుడుగా చంద్రబాబు పై కేసు పెట్టాలని నాని డిమాండ్ చేశారు.

tags : kodali nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info