A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
Share |
October 17 2019, 12:18 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఘాటు జవాబు ఇచ్చింది . ఆ పార్టీ నేత ,ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ కోడెల మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు వందల,వేల కోట్ల రూపాయలు దోచుకుని ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆయన అన్నారు. కోడెల తో తప్పులు చేయించింది చంద్రబాబేనని ,తద్వారా ఆయన ఆత్మహత్యకు ఆయనే కారణమి గడికోట అన్నారు. కోడెల కుటుంబ సబ్యుల వల్లే మరణించారని పార్టీ వారే మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీ నేత నారాయణరెడ్డిని హత్య చేశారని, అనంతపురం జిల్లాలో వైసిపి కార్యకర్తులు అనేక మంది హత్యకు గురయ్యారని, అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు. కోడెలకు చంద్రబాబు ప్రాదాన్యం ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆయన అన్నారు. ఆయన మరణం తర్వాత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. బతికి ఉన్నప్పుడు హింసించి, చనిపోయాక శవరాజకీయం చేస్తారని ఇది చంత్రబాబుకు అలావాటేనని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్.మరణానికి చంద్రబాబే కారణమని , హరికృష్ణ మరణం సమయంలోను రాజకీయం చేశారని ఆయన అన్నారు. కోడెలపై కేసులు పెట్టవలసిన అవసరం తమ కు లేదని ఆయన అన్నారు. కోడెల కుటుంబం వారు చేసిన అక్రమాలపై ప్రజలు కేసులు పెడితే వారిని చంద్రబాబు బెదిరిస్తున్నారని శ్రీకాంతరెడ్డి ద్వజమెత్తారు.

tags : gadolpta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info