A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
Share |
June 2 2020, 1:58 am

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం అప్పుడే ఆరంబం అయింది. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఆయా గ్రామాలలో పర్యటిస్తూ పార్టీ అబ్యర్ధి పద్మావతిని గెలిపించాలని కోరుతున్నారు. చింతలపాలెంలో ఆయన మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించి, కొట్టించి, బెదిరించి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీస్‌ స్టేషన్‌లను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ వారు గలీజు రాజకీయాలు పాల్పడుతున్నారన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిస్పందిస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.
ఉప ఎన్నికలు.. మన ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికలన్నారు. హైకమాండ్‌ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తుందని. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

tags : uttamkumar reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info