A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
Share |
October 17 2019, 12:22 am

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వచ్చిన పర్నిచర్ కేసు ఒక చెత్త కేసు అని టిడిపి ఎమ్.పి కనకమేడల రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు.ఆయన దీనిపై ఒక ప్రకటన చేశారు. కోడెల శివప్రసాదరావు మరణించేలా ఆయన్ని ప్రేరేపించింది, సైద్ధాంతికంగా, మానసికంగా ఆయన వేదనకు గురయ్యేలా చేసింది, వైసీపీ ప్రభుత్వమేనని, పల్నాటిపులిగా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తికి చెత్తఫర్నీచర్‌ అంశాన్ని అంటగట్టి, ఆత్మహత్య చేసుకునేలా చేసింది ప్రభుత్వ కక్షసాధింపు ధోరణేనని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆక్షేపించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోడెల శివప్రసాదరావు సంతాపసభలో పాల్గొన్న అనంతరం కనకమేడల విలేకరులతో మాట్లాడారు కోడెల శివప్రసాదరావుని తీవ్రవేదనకు గురిచేసింది, ఆయన మరణానికి కారణమైంది, ఆయనపై బనాయించిన అక్రమ కేసులు, ప్రభుత్వం అనుసరించిన విధానాలేనని రవీంద్రకుమార్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ దాష్టీకాలను, ప్రత్యర్థులపై జరుగుతున్న వేధింపులను ప్రసారం చేస్తున్నాయని, ప్రజలకు తెలిసేలా చేస్తున్నాయనే అక్కసుతోనే ఏబీఎన్‌, టీవీ-5 ఛానళ్లను ప్రభుత్వం నిషేధించిం దన్న ఆయన, అధికారపార్టీ మీడియా అయిన సాక్షి ఛానల్‌లో మాత్రం నిత్యం అసత్యాలు చూపుతుండటం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

tags : kanakamedal, kodel, furniture case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info