A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
Share |
June 2 2020, 2:02 am

ఇక ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. రాజస్తాన్ లో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన పార్టీలో కలిపేసుకుంది.ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల కాంగ్రెస్ లో చేరిపోయారు. వారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌ సీపీ జోషికి లేఖ రాశారు. ఈ సందర్భంగా రాజేంద్ర గడ్‌ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ...‘మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండటంలో.. అశోక్‌ జీ అత్యుత్తమ ముఖ్యమంత్రి. రాజస్తాన్‌ను ఆయన కంటే గొప్పగా పాలించే సీఎం మరెవరూ లేరు. బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు తెలిపే బదులు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాం అని ప్రకటించారు.

tags : rajastan, congress, bsp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info