A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ నిజాయితీగా మాట్లాడారు
Share |
June 2 2020, 12:21 am

గోదావరిలో బోటు ప్రమాదం పై ముఖ్యమంత్రి జగన్ నిజాయితీగా మాట్లాడారనిపిస్తుంది. ప్రబుత్వమే ఈ ఘటనకు బాద్యత వహించాలని ఆయన అబిప్రాయపడ్డారు. టూరిజం బోట్లు వరద ఉదృతి కారణంగా ఆగిపోతే ప్రైవేటు బోట్లు ఎందుకు ఆగలేదని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు, అధికారులు ఎందుకు అడ్డుకోలేదు?ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన బోటు ప్రమాదంపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ‘ఇంతమంది ప్రాణాలు పోయాయంటే కారణం ఎవరు? మన అలసత్వం కారణంగానే ఇది జరిగింది. బాధితులను చూసినప్పుడు గుండె చెరువైంది. కుటుంబాలకు కుటుంబాలే కోల్పోయారు. మనమంతా ఏం చేస్తున్నాం అనిపిస్తోంది. ఆపగలిగే పరిస్థితిలో ఉన్నా బోటును ఆపలేకపోయారు’ అని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info