A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
Share |
May 27 2020, 7:17 am

మాజీ స్పీకర్ కోడెల శిపవ్రసాదరావు మరణంపై వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విచారం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన కోడెల మరణించినందుకు విచారిస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఈ ఉదయం మరణించినట్లు మీడియా ద్వారా తెలిసిందని, దీనిపై అనేక రకాల వార్తలు వస్తున్నాయని, ఆత్మహత్య చేసుకున్నారని ,మరో రకమైన వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఇది వివాదాస్పదమైన మృతిగా కనిపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ చేయించి వాస్తవ పరిస్తితి ప్రజలకు తెలియచేయాలని కోరుతున్నామని రాంబాబు అన్నారు. ఇందుకు సంబందించిన ఆదారాలను కూడా భద్రపరచాలని ఆయన అన్నారు.

tags : ambati ,kodela

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info