A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
Share |
May 27 2020, 7:24 am

ఊహించినదానికన్నా వేగంగా తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విషయంలో రాజకీయం చేస్తోంది. కనీసం కోడెల మరణానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా టిడిపి నేతలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య అని , ప్రభుత్వ వేదింపుల వల్లే కోడెల మరణించారని మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ప్రకటనలు గుప్పించారు. చివరికి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా ఇదంతా జగన్ ప్రభుత్వ వేధింపు వల్లే జరిగిందని ఆరోపించారు. కోడెల మరణంపై వీరికి సానుభూతి ఉందా.లేక ఆ మరణాన్ని తమ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి.తప్పులు ఏవో జరుగుతుంటాయని, కాని ప్రభుత్వం వేదించడం ఏమిటని, చట్టాలు,పోలీసు వ్యవస్థ ఉంటాయని, కాని వేధింపులు దేనికని సోమిరెడ్డి అంటున్నారు.

tags : kodela

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info