A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల కన్నుమూత
Share |
May 27 2020, 7:27 am

ఆంద్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని తన ఇంటిలో కోడెల ఉరి వేసుకున్నారని టివి 9 కదనం. ఆయన వయసు డెబ్బరెండేళ్లు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియో జకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరోసారి సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికలలో ఓటమి చెందారు. 1988 లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లోను ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లోను ఆయన పనిచేశారు. 2014లో విభజిత ఎపి శాసనసభకు స్పీకర్ అయ్యారు. గుంటూరు ఎసి కాలేజీలో చదువుకున్నారు. ఆయనకు భార్య ,కుమారుడు,కుమార్తె ఉన్నారు. మరో కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. 1982 లో ఎన్.టి.ఆర్.పార్టీ పెట్టినప్పుడు టిడిపిలో చేరారు. ఆయన మంచి సర్జన్ గా పేరొందారు.కోడెల ఈ రకంగా మరణించడం బాదాకరమని వైసిపి ఎమ్.పి రఘురామకృష్ణంరాజు విచారం వ్యక్తం చేశారు.

tags : kodela, died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info