A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల ఆత్మహత్య యత్నం?
Share |
May 27 2020, 8:34 am

ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ఎన్.టి.వి, టివి 9 లలో వార్తలు వచ్చాయి. కాగా ఈటివి లో మాత్రం కోడెల గుండెపోటుకు గురయ్యారని వార్త వచ్చింది. ఆయనను హైదరాఆద్ లోని బసవతారకం ఆస్పత్రికి తరలించారని సమాచారం. ఆయన పరిస్తితి విషమంగా ఉందని అంటున్నారు. ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నారని కదనం. గత కొంతకాలంగా కోడెల కుటుంబంపై పలు కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. కుమారుడు, కూతురు లపై అనేక అభియోగాలువచ్చాయి. అసెంబ్లీ ఫర్నిచర్ కుమారుడు షోరూం లో పట్టుబడిన సంగతి తెలిసిందే.ఈ నేపద్యంలో ఆయన ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారా? లేక గుండెపోటుకు గురయ్యారా?అన్నది తేలకపోయినా, అప్రతిష్ట వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న భావన కలుగుతుంది. గతంలో కోడెలకు మంచి పేరు ఉండేది.కాని దురదృష్టవశాత్తు ఆయన ఈ పరిస్థితిలో పడ్డారు.

tags : kodela, suicie attemp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info