A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తప్పు మోడీదా? కెసిఆర్ దా!
Share |
October 16 2019, 10:13 pm

తెలంగాణ దనిక రాష్ట్రం..ఇది తరచుగా ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పే మాట.అలాంటి దనిక రాష్ట్రం ఇప్పుడు సంక్షోభంలో ఉందని బడ్జెట్ విశ్లేషణలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి స్వయంగా బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఒక ఆసక్తికరమైన అంశం అయితే బడ్జెట్ లో గత అంచనాలతో పోల్చితే ఇరవై శాతం కోత పెట్టడం మరో సంచలనం.బహుశా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోను ఇలా జరిగి ఉండకపోవచ్చు.అందుకు కారణాలను కెసిఆర్ వివరిస్తూ కేంద్ర విదానాలను ,ఆర్దిక మాంద్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా పరోక్షంగా కేంద్రంపైన, కేంద్రంలో అదికారంలో ఉన్న బిజెపిపైన ఆయన దాడి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం లేదు.ప్రతి సంవత్సరం పది శాతం పెంచి అంకెలు వేసి బడ్జెట్ సమర్పించడం ఆర్దిక శాఖకు అలవాటైన విదానంగా ఉంటుంది.ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాదాన్యతల ప్రకారం ఆయా శాఖలకు కేటాయింపులలో మార్పులు,చేర్పులు ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరె్డ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు లక్ష కోట్ల బడ్జెట్ ను ఆనాటి ఆర్దిక మంత్రిగా రోశయ్య ప్రవేశ పెట్టారు.అప్పట్లో అదో పెద్ద వార్త. ఆ తర్వాత అది లక్షన్నర కోట్ల వరకు చేరింది. అంతలో రాష్ట్ర విభజన జరిగింది.సహజంగానే బడ్జెట్ లు తగ్గుతాయని అంతా అనుకున్నారు.కాని తెలంగాణలో కెసిఆర్, ఎపిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు పోటీలు పడి బడ్జెట్ ను అంకెల గారడీగా మార్చేశారు. రెండు రాష్ట్రాలకు కలిపి మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టామనిపించారు.నిజంగా అంత మొత్తం ఆదాయం ఉందా?లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా బడ్జెట్ లు సాగిపోయాయి.ఆయా శాఖలకు వేల కోట్లు కేటాయించడం, ఆ తర్వాత వాటిని ఖర్చు చేయకపోవడం మామూలు విషయంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే కదా?.నాలుగు నెలల క్రితం కెసిఆర్ తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడు లక్ష ఎనభై వేల కోట్ల కు లెక్కలు వేశారు. ఇప్పుడు కొద్ది నెలల వ్యవధి లో అది కాస్తా లక్షా నలభై ఐదువేల కోట్లకు పడిపోయింది.మొత్తం మీద 35 వేల కోట్లకు పైగా మొత్తాన్ని తగ్గించారన్నమాట.ఇది వాస్తవిక బడ్జెట్ అని టిఆర్ఎస్ అనుకూల మీడియా అబివర్ణించింది. అది వేరే విషయం.ఒక రకంగా దీనిని ఒప్పుకోవాలి. నేల విడిచి సాము చేయడం కన్నా, ఉన్న వనరులతో వాస్తవిక బడ్జెట్ రూపొందిస్తే అది ఆ రాష్ట్ర ఆర్దిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.అలాకాకుండా పిచ్చి లెక్కలతో ,ఊహాలతో బడ్జెట్ లు వేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు ఆ బుడగ పేలక తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ బుడగను కెసిఆర్ స్వయంగా చూపించి పక్కనబెట్టారని అనుకోవచ్చు. ఇక అప్పుల విషయం కూడా జీర్ణించుకోలేనిదేనని అని చెప్పాలి.2.80 లక్షల కోట్లకు అప్పు చేరింది హద్దులు దాటి చేస్తున్న అప్పులు ప్రజలపై భారానికి దారి తీస్తాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష కోట్ల వ్యం చేయవలసిన పరిస్థితి. అందులో అదిక భాగం అప్పుల రూపంలో తేవల్సిందే.ఇక అనేక హామీలుఅలాగే పెండింగులో ఉన్నాయి. ప్రబుత్వ తీరు తెన్నులు ఇలా ఉంటే నిజంగానే కేంద్రం నుంచి రావల్సిన నిదులు రాకపోవడం వల్ల, ఆర్దిక మాంద్యం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని చెబుతున్న కెసిఆర్ మాటలను పూర్తిగా అంగీకరించలేం. కొంత వాస్తవం ఉండవచ్చు.కాని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాలలో ఆచరణాత్మకంగా వ్యవహరించలేకపోయిందని ఈ బడ్జెట్ అంకెలు చెబుతున్నాయి. తెలంగాణలో బిజెపి దూకుడుగా వెళ్లాలని ఆలోచిస్తున్న నేపద్యంలో కెసిఆర్ వ్యూహాత్మంగా మొత్తం అన్ని సమస్యలకు కేంద్రం మూలం అన్న బావన కల్పించడానికి ఆయన కృషి చేసినట్లుగా ఉంది. అందుకే ఆర్దిక మంత్రి హరీష్ రావు బదులు తానే ఈ ప్రసంగాన్ని అసెంబ్లీలో చదివారని అంటారు. బిజెపిని కట్టడి చేయడానికి, భవిష్యత్తులో కేంద్రంపై పోరాటానికి కెసిఆర్ అవసరమైతే సన్నద్దమవుతున్నారన్న సంకేతం ఇచ్చారు.తెలంగాణ నుంచి రెండు లక్షల కోట్ల ఆదాయం గత ఐదేళ్లలో కేంద్రానికి వెళితే తెలంగాణకు 35 వేల కోట్ల రూపాయల మేరే వచ్చిందని ఆయన చెబుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీకర్నె ప్రభాకర్ కేంద్రం నుంచి ఇరవైవేల కోట్ల రూపాయలు రావల్సి ఉందని ఆరోపించారు. అయితే కేంద్రం పై నెట్టి కెసిఆర చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ,బిజెపిలు విమర్శించాయి.కెసిఆర్ మరో మాట చెప్పారు. ప్రస్తుతం పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించిన తర్వాతే కొత్త బిల్లులు చెల్లిస్తామని ,ఆర్దిక క్రమశిక్షణ పాటిస్తామని చెప్పారు.ఇది మంచి విషయమే.స్థూలంగా చెప్పాలంటే కెసిఆర్ ఈసారి బడ్జెట్ ద్వారా కొత్త పందాకు తెరదీశారు. తోచిన లెక్కల బడ్జెట్ లు సమర్పించడం కాకుండా ఉన్నంతలో కొంత వాస్తవికతకు దగ్గరగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ఖర్చుకు అవసరమైన మొత్తాలను సరిగా అంచనా వేసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారని అనుకోవాలి.అయితే మరి ఇంతకాలం గారడీ బడ్జెట్ లను ప్రవేశ పెట్టినట్లు కూడా కెసిఆర్ అంగీకరిస్తున్నట్లేనా?

tags : kcr, modi

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info