A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
Share |
May 27 2020, 8:37 am

ఎపి రాజదానికి సంబందించిన సంస్థ కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అదారిటీ (సిఆర్డిఎ) వద్ద ప్రస్తుతం 406 కోట్ల రూపాయలే ఉన్నాయని తేలింది. ఈ విషయం ఒక పత్రిక వార్తగా ఇచ్చింది. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతో మిగిలిన మొత్తం 406 కోట్ల రూపాయలేనట.ఇప్పుడు ఆ మొత్తంతో అబివృద్ది కార్యక్రమాలు చేపట్టడం అసాద్యమని అదికార వర్గాలు అంటున్నారు.గత ఐదేళ్లలో 8419 కోట్ల రూపాయలు రాజదాని కోసం అప్పుల ద్వారా ,ఇతరత్రా సమీకరించారు. అందులో 4860 కోట్ల రూపాయలు వివిధ రూపాలలో వచ్చిన అప్పులు కాగా, వీటిని రాజదాని బాండ్ల ద్వారా, బ్యాంకుల ద్వారా తీసుకు వచ్చారు.కేంద్రం నుంచి 1500 కోట్లు, ఇతర గ్రాంట్ల ద్వారా 1096కో్ట్లు వచ్చాయి. అయితే భూ సమీకరణ కోసం 1310 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూ సమీకరణ చేశామని ప్రచారం చేసుకునేవారు. కన్సల్టెంట్లకు 321 కోట్లు వ్యయం చేశారు.మిగిలిన వ్యయం అంతా అనుత్పాదక వ్యయమేనని ఆ పత్రిక రాసింది.మొత్తం మీద 8415 కోట్లు ఖర్చు అయితే చేసేశారు.కాని అక్కడ కాంక్రీట్ గా ఏమి కనబడడం లేదని ఆ కదనం వివరించింది.

tags : amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info