A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
Share |
May 27 2020, 7:39 am

‏తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయిందని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు టిడిపిని కుల పార్టీగా మార్చివేశారని ,దాంతోనే మిగిలిన కులాలన్ని ఆ పార్టీని వ్యతిరేకించాయని ఆయన అన్నారు. టిడిపి రాజకీయ పార్టీగా కాకుండా ఒక వ్యాపార పార్టీగా మార్చారని, దానిద్వారా నేతలు వీలైనంత దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. త్రిమూర్తులు చేరిక ఆరంభం మాత్రమేనని, అనేక మంది రావడానికి సిద్దంగా ఉన్నారని, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే రావాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడంతో టిడిపి ఎమ్మెల్యేలు రాలేకపోతున్నారని ఆయన అన్నారు.జగన్ నాయకత్వంపై ప్రజలలో విశ్వాసం పెరుగుతోందని ఆయన అన్నారు.

tags : amanchi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info