A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కు వైసిపి ఎమ్మెల్యే రాజీనామా సవాల్
Share |
September 23 2019, 1:51 am

పల్నాడులో చంద్రబాబు చెబుతున్నట్లు వందల మంది బాదితులు ఉన్నారని రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. రుజువు చేయలేకపోతే చంద్రబాబు క్షమాపణ చెబుతారా అని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు,నేతలు మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు అన్ని అబద్దాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
పల్నాడు ప్రాంతంలో టీడీపీ బాధితులందరినీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆత్మకూరులో అరాచకం అంటూ చంద్రబాబు చేస్తున్న హంగామాలో నిజాలను బయటపెట్టి తీరుతామన్నారు. ఆత్మకూరు, పల్నాడులో ఏమీ జరగకపోయినా కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల అనుమతి తీసుకొని తాము ఆత్మకూరు వెళ్తామని, అక్కడ ఏమి జరిగిందో ప్రపంచానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. టీడీపీ పాలనలో యరపతినేని అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన గురువాచారిని చిత్రహింసలకు గురిచేసిన తీరును, తురకపాలెం గ్రామంలో మైనార్టీ సోదరులపై దాడిచేసిన ఘటన ఫొటోలను ప్రెస్‌మీట్‌లో చూపించారు.

tags : pinnelli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info