A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నన్నపనేని, అచ్చెన్నలపై కేసుల నమోదు
Share |
September 23 2019, 1:47 am

మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్,టిడిపి సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి పై కేసు నమోదు అయింది. తనను కులం పేరుతో దూషించారని మహిళా ఎస్.ఐ అనూరాద పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రాజకుమారిపై కేసు నమోదు అయిందని సమాచారం వచ్చింది. ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో 303, 506,509 r/w 34 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.చలో ఆత్మకూరు సందర్భంగా ‘ఈ దళఙతుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన‍్నపనేని దూషించారని ఆ ఎస్.ఐ. ఆరోపించిన సంగతి తెలిసిందే.కాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అదికారుల పట్ల అనుచితంగా వ్యవహరించారన్న పిర్యాదు కూడా వచ్చింది. ఐపీఎస్‌ అధికారి విక్రాంత్‌ పాఠిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్‌ఐ కోటయ్య ఫిర‍్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్సార్‌ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

tags : ap,cases

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info