A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తీసేసిన తాసిల్లార్ లకు దైర్యం చెప్పడానికే బాబు..
Share |
September 23 2019, 2:28 am

పల్నాడులో టిడిపి నేతల అరాచకాలు బయటకు రాకుండా చేయడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిల్లర వేషాలు వేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ట్విటర్ లో ఆయన ఆయా అంశాలపై స్పందించారు.


గత ఏడాది తన ‘వాళ్లపై’ ఐటి, ఇడిలు కేసులు పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోదీని గద్దె దింపుతానని వార్నింగులిచ్చేవాడు. ఇప్పడు యరపతినేని కేసు సిబిఐకి వెళ్తోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషా లు మొదలు పెట్టాడు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఎదురు దాడి చేస్తున్నాడు.


పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసిల్దార్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి @ncbn గారు చేపట్టిన డ్రామా వికటించినా, నిదురపోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పింది. ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా, బహుదూరాల నుంచి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారు.


చీకటి రోజుల గురించి @ncbn గారు చెబ్తుంటే వినాలి. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో ప్రతిపక్ష నేతను విశాఖ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా అరెస్టు చేస్తే అయన దృష్టిలో వెలుతురు రోజు? ముద్రగడ గారిని హౌజ్ అరెస్ట్ చేసి మహిళలను పోలీసులతో బూతులు తిట్టించినపుడు వాళ్ల హక్కులు గుర్తు రాలేదు. @ysjagan

దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి @ncbn గారి వేషాలు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నోడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూర్ అంటే నమ్మే అమాయకులుంటారా? @JaiTDP



ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు @ncbn గారూ?. @naralokesh

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info