A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కొత్త సిస్టమ్ కోసం జడ్జి నియామకం
Share |
September 23 2019, 2:14 am

మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్ కోరిక నెరవేరింది. టెండర్లను ముందుగానే న్యాయ సమీక్షకు పంపించాలన్న ఆయన ఆశయం తీరింది. అందుకు న్యాయవ్యవస్థ కూడా అంగీకరించింది.టెండర్ల పారదర్శకత కోసం ఏర్పడిన జ్యుడిషయల్ కమిషన్ బాద్యతల నిర్వహణకు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బులుసు శివశంకరరావు నియమితులయ్యారు. రూ.100కోట్లు దాటిన టెండర్లను ముందుగానే న్యాయసమీక్షకు పంపిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియకోసం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ సిఫారసు మేరకు బుధవారం జస్టిస్‌ శివశంకరరావు పేరు ఖరారు చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

tags : justice sivasankararao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info