A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అజ్ఞాతంలో సోమిరెడ్డి- ఇంటికి పోలీస్ నోటీస్
Share |
September 23 2019, 1:48 am

పోర్జరీ డాక్యుమెంట్ల కేసులో ఇరుకున్న మాజీ మంత్రిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్త ఆశ్చర్యంగానే ఉంది. ఆయన పోలీసుల ఎదుట విచారణఖు హాజరు కావల్సి ఉన్నా ఆయన రాలేదు. ఈలోగా ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా, 41 సి కింద ఆయనను విచారించండని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కూడా సోమిరెడ్డి అందుబాటులోకి రాలేదట.దాంతో ఆయన హైదరాబాద్ ఉన్న ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారని సమాచారం వచ్చింది.
వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్‌ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చి విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. పోలీసుల విచారణకు హాజరుకాకుండా సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశం అయింది.

tags : somireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info