A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పర్యావరణ ప్రేమికుడు పవన్ కళ్యాణ్ -జనసేన
Share |
September 23 2019, 2:29 am

భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా..? యురేనియం కాలుష్య తెలంగాణ
ఇస్తామా..?అని ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్
కళ్యాణ్ ప్రశ్నించారు.అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు దీని
గురించి ఆలోచించాలి అన్నారు.నల్లమల అడవులలో యురేనియం నిక్షేపాలను
అన్వేషించడానికి సర్కారు సన్నద్ధమవుతున్న తరుణంలో పర్యావరణ ప్రేమికుడు
అయిన పవన్ కళ్యాణ్ తన భాదను, ఆవేదనను వ్యక్త పరిచారు. యురేనియం
తవ్వకాలపై కొద్దిరోజులలో రాజకీయవేత్తలు,మేధావులు,నిపుణులు,పర్యావరణ
ప్రేమికులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ పవన్
కళ్యాణ్ గారు ప్రకటించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా యురేనియం అంశంపై
ఆయన స్పందిస్తూ..1852 లో అమెరికాలో అప్పటి ప్రభుత్వం నివాస ప్రాంతాల కోసం
అడవులను కొనడానికి ప్రయత్నించినప్పుడు సియాటిల్ ప్రాంత ముఖ్య అధికారి
రాసిన లేఖను తన ట్విట్టర్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉటంకించారు.. మనిషి
కోసం భూమి కాదు, భూమి మీద మనిషి పుట్టాడు అని ఆ లేఖ లో ఉంటుందని ఆయన వివరించారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info