A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల్లోకి జగన్
Share |
February 25 2020, 8:02 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ , వార్డు సచివాలయాలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఆ వ్యవస్థ ప్రజలకు అవసరమైన అన్ని అవసరాలు తీర్చాలని భావిస్తున్నారు. ఏకంగా వాటి ద్వారా 237 సేవలను అందించాలని జగన్ అదికారులకు తెలిపారు. ఇందులో 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవలను ఎప్పటిలోగా అందించగలమో వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలు, సంక్షేమ పథకాల అమలు ప్రణాళికపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్‌ కూడా ఉండాలని, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలని చెప్పారు.

tags : jagan, ward secretariats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info