A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బిజెపి దృష్టి పెట్టిందా
Share |
September 23 2019, 1:51 am

తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగడానికి బిజెపి ప్రయత్నిస్తోందా? ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కదరం ప్రకారం ఆరుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలుతమతో టచ్ లో ఉన్నారని సీనియర్ బిజెపి నేత ఒకరుచెప్పారని ఆ కదనం చెబుతోంది. అంతేకాక కొందరు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా కూడా టచ్ లో ఉన్నారని ఆయన చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్ఎల్యే రసమయి బాలకిషన్ , ఆ తర్వాత నాయిని నరసింహారెడ్డి తదితరుల విమర్శల తర్వాత బిజెపి నేతలు ఈ పరిణామం గురించి చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ లో కొందరు టి.ఎమ్.సి. ఎమ్మెల్యేలను బిజెపి ఆకర్షించింది. అలాగే ఇక్కడ కూడా చేయాలని ఆలోచిస్తున్నారా అన్న చర్చ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇప్పటికే బిజెపికి దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే టిఆర్ఎస్ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే వారిపై వేటు పడే అవకాశం ఉంది.అందువల్ల బిజెపిలోకి వెళ్లాలనుకున్న అంత తొందరగా జరగకపోవచ్చన్న అబిప్రాయం కలుగుతుంది. అయితే అనధికారికంగా ఎవరైనా బిజెపితో టచ్ లో ఉంటారా అన్నది చూడాలి.

tags : bjp, trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info