A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోస్టల్ రెగ్యులేషన్ - ప్లాట్ల కూల్చివేత సన్నద్దం
Share |
September 23 2019, 2:12 am

నా ఇంటిని ముంచుతారా? నా ఇంటికి నోటీసు ఇస్తారా అని ఎపిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుంటారు. కాని సుప్రింకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కేరళలో నదీతీరాన నిబందనలు ఉల్లంఘించి నిర్మించిన భారీ అపార్టుమెంట్లను కూల్చడానికి రంగం సిద్దం అవుతోంది.కొచ్చిన వద్ద మరాడు మున్సిపల్ పరిదిలో నది వెంబడి ఉన్న అపార్టుమెంట్లు కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని సుప్రింకోర్టు స్పష్టం చేసింది.అక్కడ ఉన్న అపార్లుమెంట్లను సెప్టెంబర్ 20 కల్లా కూల్చి తమకు రిపోర్టు చేయాలని కోర్టు ఆదేశించింది.దీనంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ అపార్టుమెంట్లలో నివసిస్తున్న వారు ఆందోళనకు దిగుతున్నారు.అయితే ప్రభుత్వ అదికారులు తాము ఏమీ చేయలేమని చెబుతున్నారు. దాంతో వాటిలో నివిసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వెంటనే వాటిని ఖాళీ చేయాలని అదికారులు వారికి సూచిస్తున్నారు.. పరిస్తితి ఇలా ఉంటే ఎపిలో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రజావేదికను కూల్చుతారా? విద్వంసమా అని అడుగుతున్నారు. అంటే ఆయన చెబుతున్నదానిప్రకారం సుప్రింకోర్టు విద్వంసానికి ఆదేశాలు ఇచ్చిందా?

tags : kerala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info