A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పల్నాడు పౌరుషాన్ని బాబు కించపరుస్తున్నారు
Share |
September 23 2019, 2:29 am

గతంలో చంద్రబాబునాయుడు దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు కూడా ప్రజలను రెచ్చగొట్టి మోసం చేయాలని చూస్తున్నారని నరసరావుపేట వైసిపి ఎమ్.పి లావు కృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు ప్రజలు అభివృద్ధి, శాంతి కోరుకుంటున్నారని.. అక్కడ చిచ్చు పెట్టొద్దని చంద్రబాబును కోరారు.గతంలో జరిగిన అరాచకాలపై చర్చకు వస్తారా అని సవాల్ చేవారు. పల్నాడుపై చంద్రబాబు చేస్తున్న హడావుడికి వైసిపి నేతలు కౌంటర్ ఇచ్చారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు సభకు కోడెల, యరపతినేనితోపాటు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పల్నాడు మాజీ ఎమ్మెల్యేలను కూడా తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్‌ విసిరారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. పల్నాడు పౌరుషాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో రౌడీషీటర్లు తప్ప, పల్నాడు ప్రాంత ప్రజలు ఎవరూ లేరన్నారు.

tags : ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info