A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
;ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు..జగన్
Share |
February 22 2020, 5:29 pm

ప్రభుత్వంపై రాళ్లు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇసుక సరఫరాపై ఆయన సమీక్ష చేశారు. ‘ఇసుక’లో అవినీతిని అడ్డుకోవడం వల్ల అది సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక స్టాక్‌యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గగానే రీచ్‌ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్‌ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందుకనుగుణంగా నిర్మాణాదారులు ప్లాన్‌ చేసుకుంటారని చెప్పారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫుటేజీని మానిటరింగ్‌ చేసే వ్యవస్ధ కూడా ఉండాలని అన్నారు. బల్క్‌ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు.

tags : jagan, stones

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info