A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మజ్లిస్ అడుగులకు టిఆర్ఎస్ ...
Share |
September 23 2019, 2:38 am

మజ్లిస్‌ అడుగులకు మడుగులొత్తుతూ టీఆర్‌ఎస్‌ చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.ప్రజల త్యాగం లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని ఆయన అన్నారు. చరిత్రను కాలగర్భంలో కలిపే యత్నం జరిగిందని,ఇది క్షమించరాని నేరమని ఆయన అన్నారు. అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించడం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మను ఒకే సామాజిక వర్గానికి పరిమితం చేయడం సరికాదని అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించింది. రాష్ట్రంలోనూ హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళిక తయారు చేస్తోంది.

tags : lakshman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info