A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎట్టకేలకు చింతమనేని అరెస్టు
Share |
September 23 2019, 2:09 am

మాజీ ఎమ్మెల్యే,టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. గత కొంతకాలంటగా ఆయన పరారీలో ఉన్నారు. దళితులను దూషించిన కేసుతో సహా పలు కేసులు ఉన్నాయి. చింతమనేని బాధితులు అనేక మంది పోలీసులకు ఆయనపై పిర్యాదు చేశారు. చింతమనేని భార్య అనారోగ్యానికి గురైందని,దాంతో ఆయన దు్గ్గిరాలలోన ఇంటికి వచ్చారని సమాచారం.ఆ విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని ఆయనను అరెస్టు చేశారు. కాగా చింతమనేని అరెస్టును అడ్డుకునేందుకు ఆయన మద్దతుదారులు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.12 రోజులుగా పరారీలో ఉన్న చింతమనేనిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోగలిగారు.

tags : chintamaneni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info