A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజమండ్రి వైసిపికొ కొత్త కోఆర్డినేటర్
Share |
September 23 2019, 1:42 am

రాజమహేంద్రవరానికి వైఎస్ ఆర్ కాంగ్రస్ పార్టీ కొత్త సమన్వయ కర్తను నియమించడం విశేషం. గత ఎన్నికలలో అక్కడ పోటీచేసిన రౌతు సూర్యప్రకాశరావు ఓటమి చెందారు. తాజాగా ఎపిఐఐపి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం ను రాజమండ్రి నగర సమన్వయకర్తగా నియమించారు. సుబ్రహ్మణ్యం మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీని విజయ పంథాన నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు భరత్, గీత, అనురాధ, ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

tags : new co ordinator

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info