A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వల్లే ఆర్దిక మాంద్యం-కాంగ్రెస్ ఎమ్మెల్యే
Share |
February 22 2020, 12:58 am

దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్ర్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. గత ప్రభుత్వాలు మిగిల్చిన సంపదను ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ పరిపాలన తీరుతోనే ఆర్థిక మాంద్యం వచ్చిందన్నారు. దాన్ని కేంద్రం మీదకు రుద్దుతున్నారని తూర్పారబట్టారు.
ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లు అని ముఖ్యమంత్రి విమర్శించారని..ఆయన ఎంతమందికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలని సీతక‍్క డిమాండ్‌ చేశారు. బడ్జెట్లో ఖజానా ఖాళీ అయితే నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలెందుకని ప్రశ్నించారు. ఒక్క కొత్త గురుకుల భవనం కూడా కేటాయించాలేదని మండిపడ్డారు. ప్రజలు డెంగీ,మలేరియాతో బాధపడుతుంటే ఆసుపత్రులకు బడ్జెట్‌ కూడా పెంచలేదని సీతక్క అన్నారు.

tags : seetakka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info