A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఊపిరి ఉన్నంతవరకు టిఆర్ఎస్ లోనే-మంత్రి
Share |
September 23 2019, 1:51 am

ఊపిరి ఉన్నంతవరకు తాను టిఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరీంనగర్ పట్ల ప్రత్యేక అబిమానం ఉందని, అందుకే నలుగురికి మంత్రి పదవులు ,వినోద్ కుమార్ కు ప్రణాళిక బోర్డు పదవి ఇచ్చారని ఆయన అన్నారు. తాను కెసిఆర్ పిలుపు మేరకే టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లోకి వచ్చానని ఆయన అన్నారు. తాను కౌన్సిలర్ పదవి నుంచి పోటీచేసిన అన్ని ఎన్నికలలో గెలిచానని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన చెప్పారు.గత ఎన్నికలలో కెసిఆర్ బొమ్మపైనే గెలిచానని ఆయన అన్నారు. కెసిఆర్ ను చూసే ప్రజలు ఓట్లు వేశారని ఆయన అన్నారు. పలు అబివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన అన్నారు.

tags : kamalakar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info