A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వలంటీర్ల వ్యవస్థ వల్ల భారం-బిజెపి
Share |
September 23 2019, 1:52 am

ఎపిలో వలంటీర్ల వ్యవస్థపైన బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.జన్మభూమి కమిటీల బదులు వలంటీర్ల వ్యవస్థను పెట్టారని ఆయన ఆరోపించారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులైతే రాతపరీక్షలు ఎందుకు పెట్టడం లేదని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు దీని ద్వారా ఉపాది కల్పించారని ఆయన ఆరోపించారు.ప్రబుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల భారం పడుతోందని ఆయన ఆరోపించారు. గత టిడిపి ప్రభుత్వానికి , జగన్ ప్రభుత్వానికి పెద్ద తేడా కనిపించడం లేదని, పాలనపై పట్టు కనపడడం లేదని ఆయన అన్నారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాక వ్యక్తులు మారారు కాని, వ్యవస్థలు మారలేదని ఆయన అన్నారు.

tags : kanna, volunteers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info